గుంటూరు రైల్వేస్టేషన్లో జరిగిన ఆ సంఘటనతో నా లైఫ్ మారిపోయింది: బన్నీ వాసు
- నిర్మాతగా బన్నీవాసు బిజీ
- పాలకొల్లులో తన లైఫ్ గురించిన ప్రస్తావన
- ఇబ్బందుల్లో పడేసిన అప్పులు
- అప్పులవాళ్లను చూసి దాక్కున్నానని వెల్లడి
బన్నీ వాసు .. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. ఇక బయటివారికి కూడా బాగానే తెలుసు. గీతా ఆర్ట్స్ 2 నుంచి ఏ సినిమా రిలీజ్ అవుతున్నా అందుకు సంబంధించిన ఈవెంట్స్ లో బన్నీ వాసు కనిపిస్తూనే ఉంటాడు. అల్లు అరవింద్ నమ్మకాన్ని ఆయన ఏ స్థాయిలో సంపాదించుకున్నాడనేది అర్థమవుతూనే ఉంటుంది. ఆయన తాజా చిత్రంగా 'వినరో భాగ్యము విష్ణుకథ' రానుంది.
తాజా ఇంటర్వ్యూలో బన్నీవాసు మాట్లాడుతూ .. " కాలేజ్ రోజుల్లోనే నాకు కారు ఉండేది. డబ్బుకు లోటు ఉండేది కాదు .. నా సరదాలకు అడ్డూ అదుపూ ఉండేది కాదు. నేను ఢిల్లీలో ఉండగా మా ఫాదర్ కనిపించకుండా పోయారని కాల్ వచ్చింది. ఆర్ధికపరమైన విషయాల కారణంగా ఊళ్లో అంతా గొడవగా ఉందని తెలిసి వెళ్లాను. ఆ పరిస్థితుల్లో ఊళ్లోకి అడుగుపెట్టాలంటే భయం వేసింది" అన్నారు.
"మొదట్లో నాన్నగారి కోసం అప్పులవాళ్లు వస్తే భయపడి దాక్కునేవాడిని. ఆ తరువాత ఫేస్ చేయడం మొదలుపెట్టాను. ఫాదర్ తిరిగొచ్చిన తరువాత కూడా అక్కడే ఉండి అంతా చక్కబెట్టాను. ఆ తరువాత యానిమేషన్ నేర్చుకుందామని బెంగుళూరు బయల్దేరాను. ట్రైన్ గుంటూరులో ఆగితే, టిఫిన్ చేయడానికి దిగాను.
ఆ సమయంలో ఒకతను నా దగ్గరికి వచ్చి 'బెంగుళూర్ వద్దు .. హైదరాబాద్ వెళ్లు' అన్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు .. ఎందుకు చెప్పాడో తెలియదు .. సరే చూద్దాం అనుకుని, అక్కడ దిగిపోయి హైద్రాబాద్ ట్రైన్ ఎక్కేశాను. అలా హైదరాబాద్ వచ్చిన నాల్గవ రోజునే అల్లు అరవింద్ గారి అబ్బాయి బాబీతో పరిచయమైంది. ఆ తరువాత నుంచి ఇక అందరికీ తెలిసిందే" అని చెప్పుకొచ్చారు.