నేడు కూడా లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
- దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం శుభారంభం
- అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో లాభాల బాటలో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు కూడా లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో సెన్సెక్స్ 379 పాయింట్ల లాభంతో 61,654 వద్ద.. నిఫ్టీ 113 లాభంతో 18,129 వద్ద ట్రేడవుతున్నాయి.
ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.63 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్ మినహా మిగతా షేర్లన్నీ లాభాల బాటలో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటర్స్ సంస్థల షేర్లు గరిష్ఠంగా లాభపడుతున్నాయి.
ఇక బుధవారం అమెరికా మార్కెట్లు కూడా లాభాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ సూచీలూ లాభాల బాటలో పయనిస్తున్నాయి. విదేశీ మదుపర్లు బుధవారం దేశీ మార్కెట్లోకి నిధులు మళ్లించారు. గత నాలుగు రోజులుగా ఇదే పంథా కొనసాగిస్తున్నారు. విదేశీ వ్యవస్థాగత మదుపర్లు(ఎఫ్ఐఐ) నిన్న రూ.432.15 కోట్ల విలువ చేసే షేర్లు కొనుగోలు చేయగా.. దేశీ ఇన్వెస్టర్లు రూ.516.4 కోట్ల మేర కొనుగోళ్లు చేపట్టారు.