త్రివిక్రమ్ సినిమాకి నేను డైరెక్టర్.. ఇంతకంటే ఏం కావాలి?: వెంకీ అట్లూరి

  • 'సార్' సినిమాకి దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి
  • తమిళనాట ఎనిమిది వీకెండ్స్ చూస్తుందన్న డైరెక్టర్ 
  • ధనుశ్ నాదస్వరం లాంటివారు అని కితాబు 
  • జీవీ ప్రకాశ్ సంగీతం హైలైట్ అని వెల్లడి  
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ నెల 17వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి 'సార్' సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో వెంకీ అట్లూరి మాట్లాడుతూ .. "ఇది ఒక వీకెండును కాదు .. నాలుగు వీకెండ్స్ ను చూసే సినిమా. తమిళనాడులో ఎనిమిది వీకెండ్స్ ను చూడటం ఖాయం. ఇక త్రివిక్రమ్ గారు రాసిన సినిమాలను చూసిన తరువాతనే నేను రాయడానికి ట్రై చేసింది. ఆయన నిర్మించిన ఈ సినిమాకి నేను డైరక్టర్ ను అయ్యాను .. ఇంతకంటే ఏం కావాలి?" అన్నారు.

"ఈ రోజున 'మాస్టారూ .. మాస్టారూ' పాట వైరల్ గా మారిపోయింది. నిజంగా జీవీ ప్రకాశ్ కుమార్ గారు చాలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ఇక ధనుశ్ గారి విషయానికి వస్తే ఆయనకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఆయన ఒక నాదస్వరం లాంటివారు. నాదస్వరం అన్ని వాద్య పరికరాలను డామినేట్ చేస్తుంది. అలాగే ధనుశ్ గారు కెమెరా ముందుకు వస్తే ఆయన మాత్రమే కనిపిస్తారు .. ఆయన మాత్రమే వినిపిస్తారు" అని చెప్పారు.

'ధనుశ్ గారి యాక్టింగ్ కి జీవీ ప్రకాశ్ కుమార్ యాడ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కాలం పాటు  మీకు గుర్తుండిపోతుంది. నేను ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడానికి కారణం ఈ కంటెంట్ పై ఉన్న నమ్మకమే. నన్ను నమ్మి థియేటర్ కి వెళ్లండి .. ఆ తరువాత మాట్లాడుకుందాం" అని చెప్పుకొచ్చాడు.



More Telugu News