మాటలకు మనిషి రూపం వస్తే త్రివిక్రమ్: హైపర్ ఆది
- 'సార్' సినిమాలో ముఖ్యమైన పాత్రను చేసిన హైపర్ ఆది
- ఈ సినిమా ఒక విందుభోజనం లాంటిదని వివరణ
- త్రివిక్రమ్ ను పొగడ్తలతో ముంచెత్తిన హైపర్ ఆది
- ఆయనకి ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉందని వ్యాఖ్య
ధనుశ్ హీరోగా వెంకీ అట్లూరి రూపొందించిన 'సార్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన హైపర్ ఆది మాట్లాడుతూ .. 'సార్' సినిమా ఒక విందు భోజనం లాంటిది. ఆలాంటి ఒక సినిమాలో ధనుశ్ గారితో కలిసి యాక్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అన్నాడు.
ఇక నా ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే అది త్రివిక్రమ్ గారే. ఒకరకంగా చెప్పాలంటే ఆయనే నాకు స్ఫూర్తి. ఒక డైరెక్టర్ తన సినిమాల్లోని మాటలను .. పాటలను .. ఫైట్లను పదే పదే చూసేలా చేయవచ్చు. కానీ స్టేజ్ మీదిచ్చే స్పీచ్ లను కూడా పదే పదే చూసేలా చేసే ఏకైక దర్శకుడు ఆయన. ఒక డైరెక్టర్ కి హీరోకి ఉన్నంత క్రేజ్ ఉందంటే ఆయన మాటల ప్రభావం అలాంటిది .. ఆ ప్రవాహం అలాంటిది" అని చెప్పాడు.
"మాటలకి మనిషి రూపం వస్తే అది మాట్లాడే మొదటి మాట 'థ్యాంక్యూ త్రివిక్రమ్ గారు' అనే. ప్రాసకి ఆశ కలిగితే అది చూడాలనుకునే మొదటి ఫేసు త్రివిక్రమ్ గారిదే. త్రివిక్రమ్ గారి ప్రతి సినిమాలోను కుటుంబ విలువలు ఉంటాయి. నాకు తెలిసి ఒక వైట్ పేపర్ కి కరెక్టుగా న్యాయం చేయగలిగే ఏకైక రైటర్ త్రివిక్రమ్ గారు. ఆయనది భీమవరం .. ఆయన మన ఇండస్ట్రీకి లభించిన వరం" అంటూ స్టేజ్ పై సందడి చేశాడు.