రాజధానిపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారు: యనమల

  • రెవెన్యూ లోటు రూ. 40 వేల కోట్లకు ఎలా పెరిగిందన్న యనమల
  • రాష్ట్ర అప్పులపై చర్చకు రావాలని సవాల్
  • వ్యవస్థలపై ప్రభుత్వానికి గౌరవం లేదని మండిపాటు
ఏపీ రాజధాని అంశం మళ్లీ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీకి ఏకైక రాజధాని విశాఖపట్నం అని మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొందరు మంత్రులు స్పందిస్తూ... మూడు రాజధానులే ఏపీ ప్రభుత్వ పాలసీ అని చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల మాట్లాడుతూ, రాజధానిపై ఒక్కో మంత్రి ఒక్కోలా స్పందిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2018లో రాష్ట్ర రెవెన్యూ లోటు రూ. 16 వేల కోట్లుగా ఉందని, ఇప్పుడు అది రూ. 40 వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. వ్యవస్థలపై వైసీపీ ప్రభుత్వానికి గౌరవం లేదని దుయ్యబట్టారు.


More Telugu News