'కాంతార’ హీరో రిషభ్ శెట్టికి ప్రతిష్ఠాత్మక అవార్డ్
- దేశ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన 'కాంతార'
- దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డును గెలుచుకున్న రిషభ్
- మోదీ విందుకు హాజరైన కాంతార హీరో
అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన కన్నడ సినిమా 'కాంతార' దేశ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించి, హీరోగా నటించిన రిషభ్ శెట్టికి విమర్శకుల ప్రశంసలు సైతం లభించాయి. మరోవైపు ఈ చిత్రానికి గాను రిషభ్ ఒక గొప్ప పురస్కారాన్ని అందుకున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును ఆయన గెలుచుకున్నాడు.
ఇదిలావుంచితే, కర్ణాటక రాజ్ భవన్ లో ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు పలువురు కన్నడ సినీ ప్రముఖులతో కలసి రిషభ్ హాజరయ్యాడు. విందులో పాల్గొన్న వారిలో యష్, విజయ్ కిరంగదూర్, అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం 'కాంతార 2' సినిమాపై రిషభ్ పని చేస్తున్నారు. అయితే ఈ చిత్రం సీక్వెల్ కాదని ఆయన చెప్పారు. 2024లో ఈ చిత్రం విడుదలవుతుందని చెప్పారు.