మంత్రి రోజాపై మరోసారి ధ్వజమెత్తిన లోకేశ్
- సత్యవేడు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
- జబర్దస్త్ ఆంటీ అంటూ విమర్శలు గుప్పించిన లోకేశ్
- మహిళలను దారుణంగా కొట్టించిందని ఆరోపణ
- జబర్దస్త్ ఆంటీ మహిళల గురించి మాట్లాడడం సిగ్గుచేటని వ్యాఖ్యలు
యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వెంకటరెడ్డి కండ్రిగలో మహిళలతో నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ తనకు చీర-గాజులు పంపుతానని ప్రకటించిన రోజాకి తెలుగు మహిళలు సారె పెట్టేందుకు వెళితే వారిని అరెస్టు చేయించిందని ఆరోపించారు. సాటి మహిళల్ని అత్యంత దారుణంగా కొట్టించి, అరెస్ట్ చేయించిన రోజా మహిళల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.
"జబర్దస్త్ ఆంటీ అవినీతిని ప్రశ్నిస్తే మహిళల్ని కించపరిచినట్టట. నా పళ్లు రాలగొడతానని జబర్దస్త్ ఆంటీ వార్నింగ్‌లు ఇస్తోంది. పళ్లు రాలగొట్టాల్సి వస్తే ముందుగా చంద్రబాబుకు వార్నింగ్ లు ఇచ్చిన జగన్ రెడ్డి పళ్లు రాలగొట్టాలి ఆంటీ" అంటూ మంత్రి రోజాకి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
"వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 16 హౌస్ కమిటీలు, 8 సీఐడీ కేసులు పెట్టారు. ఒక్కటీ నిరూపించలేకపోయారు. రాజశేఖర్ రెడ్డి, వైసీపీలో ఉన్న లక్ష్మీపార్వతి కూడా మాపై సుప్రీంకోర్టులో వేసిన కేసుల్లో కనీసం ఆధారాలు కూడా చూపలేకపోవడంతో కేసులను కోర్టు కొట్టేసింది. జబర్దస్త్ ఆంటీ... ఇదీ మా చిత్త శుద్ధి ! మేము మా ఆస్తులు ప్రతీ ఏటా ప్రకటిస్తున్నాం. మీ వైసీపీ లో మీరు, మీ 150 మంది దొంగలు కూడా ఆస్తులు ప్రకటించగలరా?" అని లోకేశ్ సవాల్ విసిరారు.