వ్యక్తిగత లబ్ది కోసమే జయమంగళ వెంకటరమణ వైసీపీలో చేరారు: కొల్లు రవీంద్ర
- టీడీపీని వీడి వైసీపీలో చేరిన జయమంగళ వెంకటరమణ
- ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారంటూ ప్రచారం
- కైకలూరులో టీడీపీ జెండా ఎగరేస్తామన్న కొల్లు రవీంద్ర
- మరో 4 రోజుల్లో కైకలూరుకు కొత్త ఇన్చార్జి
ఏలూరు జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడం తెలిసిందే. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ నేత కొల్లు రవీంద్ర స్పందించారు. వ్యక్తిగత లబ్ది కోసమే జయమంగళ వెంకటరమణ వైసీపీలోకి వెళ్లారని ఆరోపించారు. కైకలూరులో టీడీపీ జెండా ఎగరేస్తామని స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు సూచనతో మరో నాలుగు రోజుల్లో కైకలూరుకు కొత్త ఇన్చార్జిని ప్రకటిస్తామని కొల్లు రవీంద్ర వెల్లడించారు.
జయమంగళ ఇటీవల మంత్రి కారుమూరితో కలిసి సీఎంతో భేటీ అయ్యారు. సీఎం నుంచి ఆయనకు ఎమ్మెల్సీపై హామీ లభించినట్టుగా కథనాలు వచ్చాయి. వెంకటరమణ సీఎంను కలిసిన అనంతరం ఆయనకు నలుగురు భద్రతా సిబ్బందిని కేటాయించడంతో పార్టీ మారుతున్న అంశం ఖాయమైంది.