కోహినూర్ విషయంలో బ్రిటన్ రాజవంశం కీలక నిర్ణయం
- మరో మూడు నెలల్లో చార్లెస్-3 పట్టాభిషేకం
- పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని ధరించకూడదని రాణి నిర్ణయం
- భారత్ తో ఇబ్బందులు వద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
బ్రిటన్ యువరాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ రాజవంశం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని ధరించకూడదని నిర్ణయించింది. ఈ కిరీటానికి బదులు క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నారు. పట్టాభిషేకం సమయంలో రాణి కెమిల్లా కిరీటధారణ కార్యక్రమంలో ఈ వజ్రాన్ని ధరించాలని తొలుత భావించినా... చివరకు ఆ ఆలోచనను పక్కనపెట్టారు. క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నారు. ఈ కిరీటంలో క్వీన్ ఎలిజబెత్2కి చెందిన నగలను పొదగనున్నారు.
ఇక క్వీన్ ఎలిజబెత్ 2 కిరీటంలో కోహినూర్ వజ్రం ఉండేది. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఆమె మరణించే దాకా ఆమె కిరీటంలో వజ్రం ఉంది. కోహినూర్ వజ్రం మన దేశానికి చెందినది అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ తో దౌత్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కోహినూర్ ను ధరించకూడదని రాణి కెమిల్లా నిర్ణయించినట్టు సమాచారం.