మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సజ్జల
- ఏపీ రాజధానిపై భిన్న స్వరాలు వినిపిస్తున్న వైసీపీ నేతలు
- ఏపీ రాజధాని విశాఖేనన్న బుగ్గన
- మూడు రాజధానులు అంటూ మిస్ కమ్యూనికేట్ అయిందని వెల్లడి
- వికేంద్రీకరణ దృష్ట్యా 3 రాజధానుల బిల్లు పెట్టామన్న సజ్జల
ఏపీ రాజధాని అంశంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అయోమయానికి గురిచేసేలా ఉన్నాయి. నిన్న ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో మాట్లాడుతూ, ఏపీ రాజధాని విశాఖ అని, మూడు రాజధానులు అంటూ జనాల్లోకి మిస్ కమ్యూనికేట్ అయిందని చెప్పుకొచ్చారు.
తాజాగా, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించే మూడు రాజధానుల బిల్లు పెట్టామని, ప్రస్తుతం మూడు రాజధానుల అంశం న్యాయస్థానంలో నడుస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి తేడా లేదని సజ్జల స్పష్టం చేశారు.