ఆ సినిమా అమ్మ నుంచి అమితాబ్ వరకూ భయపెట్టేసింది: వర్మ
- 'భూత్' సినిమాపై స్పందించిన వర్మ
- ఆ సినిమా చూసి అమ్మ భయపడిపోయిందని వెల్లడి
- అమితాబ్ గారికి అలా అనిపించిందని వ్యాఖ్య
- వారి మాటలే తనకి కాంప్లిమెంట్స్ అంటూ హర్షం
హారర్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మ సిద్ధహస్తుడు. ఈ తరహా సినిమాల్లో కెమెరా వర్క్ పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఆయన చాలా ప్రయోగాలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'భూత్' సినిమాను గురించి ప్రస్తావించారు.
"ఈ సినిమాను చూసి మా అమ్మ చాలా భయపడిపోయింది. తలుపులు వేయాలా? తీసి ఉంచాలా? దెయ్యం వస్తుందా? లేదంటే ఆల్రెడీ లోపలే ఉందా? అని టెన్షన్ పడిపోయిందట. 'ఇది నా కొడుకు తీసిన సినిమా .. నిజం కాదు' అనుకుంటూ నిదానంగా ఆ భయంలో నుంచి బయటికి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.
"ఇక ఈ సినిమాను అమితాబ్ చూశారు. 'ఎందుకొచ్చానురా బాబూ ఈ సినిమాకి .. పనిగట్టుకుని ఇంత భయపడవలసిన అవసరం ఉందా? నన్ను ఇంతగా భయపెట్టినందుకు, వర్మ కనిపిస్తే కొట్టేయాలి' అనుకున్నారట. ఒక రకంగా అవి నాకు కాంప్లిమెంట్స్ గానే భావిస్తాను" అన్నారు వర్మ.