'భూత్' సినిమా తీసిన ఆ ఇంటిని ఎవరూ కొనడం లేదు: వర్మ

  • హారర్ థ్రిల్లర్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ వర్మ 
  • 'రాత్' నుంచి 'భూత్' వరకూ చేసిన జర్నీ 
  • హారర్ కథలో ఎమోషనల్ హుక్ ఉంటుందన్న వర్మ 
  • ఆడియన్స్ అక్కడే కనెక్ట్ అవుతారని వెల్లడి
రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా మాఫియా నేపథ్యంలో .. హారర్ జోనర్లో సినిమాలు తీశారు. ఆయన తీసిన హారర్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను తెరకెక్కించిన హారర్ సినిమాలను గురించి ప్రస్తావించారు. 

"హారర్ జోనర్ ను నేను కనిపెట్టలేదు .. హాలీవుడ్ లో వచ్చిన సినిమాలను కొన్నిటిని మిక్స్ చేసి, నా స్టయిల్లో చూపించేవాడిని అంతే. 'రాత్' నుంచి 'భూత్' వరకూ నేను చేస్తూ వచ్చిన పని అదే. సాధారణంగా ఎవరికైనా దెయ్యం పడితే మిగతావాళ్లు ఎక్కడికైనా పారిపోవచ్చు, కానీ తమ ఇంట్లో .. తమకి బాగా కావాల్సిన వాళ్లకి దెయ్యం పడితే ఏం చేస్తారు? అప్పుడు వారిని ఫేస్ చేయవలసిందే. ఇక్కడే ఆడియన్స్ ను నేను హుక్ చేస్తూ వచ్చాను" అన్నారు. 

'భూత్'ను ముందుగా ముంబై బీచ్ దగ్గరలోని ఇంట్లో చేద్దామని అనుకున్నాము .. కానీ ఆ తరువాత ముంబైలో బాగా రద్దీగా ఉండే ప్రాంతంలోని ఇంటిని ఎంచుకున్నాము. 'భూత్' సినిమా తరువాత ఆ ఇల్లు బాగా పాప్యులర్ అయింది. అందరూ కూడా ఆ ఇంటిని చూడగానే 'భూత్' తీసింది ఇక్కడే' అని చెప్పుకుంటారు. ఆ సినిమా అక్కడ తీయడం వలన, అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ ఇంటిని ఎవరూ కొనలేదు .. అది అలా వేస్ట్ గా ఉండిపోయింది" అని చెప్పుకొచ్చారు. 



More Telugu News