నేడు ఎన్టీఆర్ ట్రస్టు వ్యవస్థాపక దినోత్సవం... స్పందించిన చంద్రబాబు, లోకేశ్

  • ఎన్టీఆర్ ట్రస్టు 26వ వ్యవస్థాపక దినోత్సవం
  • 1997లో ట్రస్టు ప్రారంభమైందన్న చంద్రబాబు
  • ఎన్టీఆర్ ఆశయస్ఫూర్తితో ట్రస్టు కార్యరూపం దాల్చిందని వెల్లడి
  • బాధితులను ఆదుకోవడంలో ట్రస్టు ముందుంటోందన్న లోకేశ్
పేదలు, బలహీన వర్గాలకు సాయపడాలన్న ఉద్దేశంతో ఏర్పడిన ఎన్టీఆర్ ట్రస్టు నేడు వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. 

ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో 1997లో ట్రస్టు ప్రారంభమైందని వెల్లడించారు. విద్య, ఆరోగ్యం, సాధికారత, ఉపాధి కల్పన, విపత్తు నిర్వహణ, సాయం వంటి కార్యక్రమాలతో నిరంతర సేవలు అందిస్తోందని వివరించారు. ఎన్టీఆర్ ట్రస్టు 26వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ట్రస్టు సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ... మహానాయకుడు ఎన్టీఆర్ ఆశయాల ఆచరణ రూపం ఎన్టీఆర్ ట్రస్టు అని అభివర్ణించారు. విపత్తుల వేళ బాధితులను ఆదుకోవడంలోనూ, విద్య, వైద్య, విజ్ఞాన, ఉపాధి రంగాల్లో ఎన్టీఆర్ ట్రస్టు ముందుంటోందని కొనియాడారు.


More Telugu News