మన్నార్ గుడి గ్యాంగ్ మాదిరి రోజా కుటుంబ సభ్యులు తయారయ్యారు: గాలి భానుప్రకాశ్

మన్నార్ గుడి గ్యాంగ్ మాదిరి రోజా కుటుంబ సభ్యులు తయారయ్యారు: గాలి భానుప్రకాశ్
  • ఎన్నికల్లో గెలిచేంత సీన్ రోజాకు లేదన్న భాను
  • మహిళలకు తలవంపులు తెచ్చేలా అసెంబ్లీలో మాట్లాడుతున్నారని విమర్శ
  • అన్ని మాఫియాల్లో రోజా ఉందని ఆరోపణ
వైసీపీ మంత్రి రోజాపై నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ గాలి భానుప్రకాశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచేంత సీన్ రోజాకు లేదని... ఒక్క ఛాన్స్ అని జగన్ ప్రజలను అడిగినందువల్లే రోజా ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవా చేశారు. ఆడపడుచులకు కూడా తలవంపులు తెచ్చేలా అసెంబ్లీలో రోజా మాట్లాడుతున్నారని... ఆమెను చూసి ఎవరూ ఓటు వేయరని అన్నారు. 

రోజా కుటుంబ సభ్యులు మన్నార్ గుడి గ్యాంగ్ మాదిరి తయారయ్యారని విమర్శించారు. ఇసుక, మద్యం, మట్టి, గంజాయి అన్ని మాఫియాల్లో రోజా ఉందని ఆరోపించారు. రక్కసిలా తయారైన రోజా నుంచి విముక్తి కోసం నిన్న లోకేశ్ పాదయాత్రకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారని చెప్పారు. తమ అధినేత చంద్రబాబుపై ఎన్నో సిట్ లు వేసినప్పటికీ ఏమీ చేయలేకపోయారని అన్నారు. రోజా ప్రెస్ మీట్లు పెట్టడం ఆపేసి , తన ఐటీ రిటర్నులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నగరికి రోజా ఏం చేసిందో చెప్పాలని అన్నారు.


More Telugu News