భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 600 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 159 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా పెరిగిన ఐటీసీ షేర్ విలువ
నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా కొంత సానుకూలతలు ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 600 పాయింట్లు లాభపడి 61,032కి ఎగబాకింది. నిఫ్టీ 159 పాయింట్లు పెరిగి 17,930కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (3.11%), రిలయన్స్ (2.41%), బజాజ్ ఫైనాన్స్ (1.84%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.78%), ఇన్ఫోసిస్ (1.57%).
టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-1.16%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.80%), ఎల్ అండ్ టీ (-0.53%), సన్ ఫార్మా (-0.52%), ఏసియన్ పెయింట్స్ (-0.49%).