ఇప్పటిదాకా రూ.1.9 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం: మంత్రి గుడివాడ అమర్నాథ్
- మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు
- సదస్సుకు ప్రచారం కోసం దేశవ్యాప్త రోడ్ షోలు
- నేడు బెంగళూరులో రోడ్ షో
- హాజరైన మంత్రులు బుగ్గన, అమర్నాథ్
విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సదస్సుకు ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర సర్కారు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బెంగళూరులోనూ నేడు రోడ్ షో నిర్వహించగా... ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ఏపీదే అగ్రస్థానం అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఇప్పటిదాకా రూ.1.9 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకు కేటాయించేందుకు 49 వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పరిశ్రమల కోసం మరో లక్ష ఎకరాల భూమి కూడా అందుబాటులో ఉందని వివరించారు. రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయని పేర్కొన్నారు.