‘తెలుసా మనసా’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ బాబీ
మరో ప్రేమకథా చిత్రంగా ' తెలుసా మనసా'
పార్వతీశం జోడీగా జశ్విక పరిచయం
దర్శకుడిగా వైభవ్ పరిచయం
సంగీతాన్ని సమకూర్చిన గోపీసుందర్
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం .. జష్విక జంటగా నటిస్తోన్న చిత్రం ‘తెలుసా మనసా’. న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై వర్ష - మాధవి నిర్మించగా, వైభవ్ దర్శకత్వం వహించాడు. పల్లెటూర్లో బెలూన్స్ అమ్ముకునే యువకుడిగా మల్లి బాబు పాత్రలో పార్వతీశం నటించాడు. హెల్త్ అసిస్టెంట్ సుజాత పాత్రను జష్విక పోషించింది.
ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని బయటకు చెప్పుకోలేకపోతారు. అలాంటి ఆ ఇద్దరూ అనుకోని కారణాలతో దూరమవుతారు. చివరికి వాళ్లిద్దరూ కలుసుకున్నారా? అనేది సినిమా కథాంశం. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ‘మనసు మనసుతో..’ అనే మెలోడి సాంగ్ విడుదలైంది.
'వాల్తేరు వీరయ్యతో సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడు బాబీ ఈ పాటను విడుదల చేసి.. సినిమా మంచి విజయం సాధించాలని చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరోసారి ఈ పాటలో ఆయన తనదైన మార్క్ చూపించారు. 'వాలెంటైన్స్ డే' సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పాట హృదయానికి హత్తుకునేలా ఉంది. వనమాలి రాసిన ఈ పాటను శ్రీకృష్ణ అద్భుతంగా ఆలపించాడు. ప్రసాద్ ఈదర సినిమాటోగ్రఫీ ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది.