కామారెడ్డి పంచాయతీ కార్యాలయానికి షాక్ కొట్టేంత బిల్లు
- జనవరి నెలకు రూ.11.41 కోట్ల కరెంట్ బిల్లు జారీ
- బిల్లు చూసి ఆశ్చర్యపోతున్న గ్రామస్థులు
- విద్యుత్ అధికారులను సంప్రదించిన సర్పంచ్
- సాంకేతిక తప్పిదంగా పేర్కొన్న సిబ్బంది
ఎలక్ట్రిసిటీ బిల్లు ఎప్పుడు వచ్చినా, ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాలి. ఎందుకంటే బిల్లుల్లో బండ తప్పులు రావడం సాధారణంగా మారిపోయింది. గతంలో విడిగా ఒక ఇంటికి లక్షల్లో కరెంటు బిల్లులు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కొత్తపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయానికి సంబంధించి జారీ చేసిన విద్యుత్ బిల్లును చూస్తే షాక్ కొట్టేలా ఉంది. జనవరి నెలకు సంబంధించి ఏకంగా 11.41 కోట్ల బిల్లు జారీ అయింది.
ఈ బిల్లు గురించి తెలుసుకున్న గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు. బిల్లు మొత్తం వివరంగా చూస్తే రూ.11,41,63,672. దీనిపై గ్రామ సర్పంచ్ విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించారు. సంబంధిత ఏఈ స్పందిస్తూ, సాంకేతిక తప్పిదం వల్లే బిల్లు అంత భారీగా వచ్చిందని బదులిచ్చారు. మీటర్ ను మరోసారి చెక్ చేసి, తిరిగి మళ్లీ బిల్లు జారీ చేస్తామని హామీ ఇవ్వడంతో సర్పంచ్ ఊపిరి పీల్చుకున్నారు.