ఢిల్లీలో మరో దారుణం.. షాపింగ్ మాల్లో మహిళా టెకీపై అత్యాచారం
- ఉద్యోగప్రయత్నాల్లో ఉన్న యువతికి ఆన్లైన్లో నిందితుడి పరిచయం
- ఇంటర్వ్యూ పేరిట బాధితురాలిని షాపింగ్‌మాల్‌కు రప్పించిన నిందితుడు
- మత్తుమందు ఇచ్చి కారులో అత్యాచారం
- పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
దేశ రాజధాని న్యూఢిల్లో మరో దారుణం వెలుగు చూసింది. షాపింగ్ మాల్ సెల్లార్లో ఓ యువతి అత్యాచారానికి గురైంది. తుషార్ శర్మ అనే వ్యక్తి తనకు మత్తు మంది ఇచ్చి కారులో అత్యాచారం చేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యువతి కథనం ప్రకారం.. ఆన్లైన్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఆమెకు తుషార్ పరిచయమయ్యాడు. ఉద్యోగం లభించేలా చేస్తానంటూ హామీ ఇచ్చాడు. గత శనివారం సహారా మాల్లో ఇంటర్వ్యూ ఉందంటూ ఆమెకు తెలిపాడు. అతడు చెప్పినట్టే ఆమె తన డాక్యుమెంట్స్ తీసుకుని మధ్యాహ్నం 1 గంటకు అక్కడకు చేరుకుంది. ఈ క్రమంలో నిందితుడు ఆమెను కారులో ఎక్కించుకుని బేస్మెంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తరువాత అతడిచ్చిన మంచీ నీళ్లు తాగాక తాను స్పృహ కోల్పోయానని చెప్పింది. ఆ తరువాత.. తుషార్ తనను బలవంతంగా కారులోకి తోసి అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపింది.
యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషప్రయోగం, అత్యాచారం, నేరపూరితంగా బెదిరింపులకు పాల్పడటం సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. మాల్లోని సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.