ఈసారి రివర్స్... చైనా గగనతలంలో అమెరికా బెలూన్లు!

  • ఇటీవల అమెరికా గగనతలంపై చైనా బెలూన్లు
  • కూల్చివేసిన అమెరికా
  • తమ గగనతలంలో అమెరికా బెలూన్లు చొరబడ్డాయంటున్న చైనా
  • తాము బాధ్యతాయుతంగా వ్యవహరించామన్న డ్రాగన్
ఇప్పటిదాకా చైనా నిఘా బెలూన్లు తమ గగనతలంలో గూఢచర్యం చేస్తున్నాయని అమెరికా తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. ఇప్పుడు చైనా కూడా అదే తరహాలో ఆరోపణలు చేస్తోంది. తమ గగనతలంలో అమెరికా బెలూన్లు చొరబడ్డాయని చైనా వెల్లడించింది. 

అమెరికా బెలూన్లు తమ గగనతలంలోకి రావడం కొంతకాలంగా జరుగుతోందని, గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు 10 పర్యాయాలకు పైగా అమెరికా బెలూన్లు అనుమతి లేకుండా తమ గగనతలంలోకి వచ్చాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు. 

అయితే, అమెరికా పంపిన బెలూన్ల ఉద్దేశం ఏంటో వెన్ బిన్ స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈ వ్యవహారంలో తాము బాధ్యతాయుతంగా, నిబద్ధతతో వ్యవహరించామని మాత్రం చెప్పారు. ఇటీవల చైనా బెలూన్లను అమెరికా కూల్చివేయడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.


More Telugu News