డబ్ల్యూపీఎల్ వేలం: తెలుగమ్మాయి అంజలి శర్వాణికి రూ.55 లక్షల ధర
- త్వరలో వుమెన్స్ ప్రీమియర్ లీగ్
- నేడు ముంబయిలో క్రికెటర్ల వేలం
- భారత మహిళా క్రికెటర్లకు భారీ ధర
- అంజలి శర్వాణిని కొనుగోలు చేసిన యూపీ వారియర్స్
క్రికెట్లో ఇప్పుడంతా లీగ్ పోటీల హవా నడుస్తోంది. పురుషుల తరహాలోనూ మహిళలకు కూడా క్రికెట్ లీగ్ లు వచ్చేస్తున్నాయి. భారత్ లో ఐపీఎల్ తరహాలో పూర్తిస్థాయిలో మహిళల కోసం నిర్వహిస్తున్న టోర్నీ... వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్). ఈ లీగ్ పోటీల్లో పాల్గొనే ఫ్రాంచైజీల కోసం నేడు మహిళా క్రికెటర్ల వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే స్మృతి మంధన, హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, ఆష్లే గార్డనర్, ఎలిస్ పెర్రీ, సోఫీ ఎకెల్ స్టోన్ వంటి స్టార్ క్రికెటర్లు కోట్లు కొల్లగొట్టారు. తాజాగా మరికొందరు క్రికెటర్లు కూడా మంచి ధరలు పొందారు.
ఇటీవల టీమిండియా మహిళల జట్టులో స్థానం దక్కించుకున్న అంజలి శర్వాణి తన ప్రతిభకు తగిన ప్రతిఫలం పొందింది. డబ్ల్యూపీఎల్ వేలంలో అంజలి శర్వాణి కనీస ధర రూ.30 లక్షలు కాగా, ఆమెను రూ.55 లక్షలకు యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. అంజలి శర్వాణి కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అమ్మాయి. ఇటీవల కాలంలో టీమిండియా తరఫున లెఫ్ట్ ఆర్మ్ పేస్ తో ఆకట్టుకుంటోంది.
మరో తెలుగమ్మాయి సబ్బినేని మేఘనకు ఈ వేలంలో రూ.30 లక్షల ధర లభించింది. ఆమెను గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
అమ్ముడైన క్రికెటర్ల జాబితా...

- పూజా వస్త్రాకర్- రూ.1.90 కోట్లు (ముంబయి ఇండియన్స్)
- రిచా ఘోష్- రూ.1.90 కోట్లు (ఆర్సీబీ)
- యస్తికా భాటియా- రూ.1.5 కోట్లు (ముంబయి ఇండియన్స్)
- మారిజానే కాప్- రూ.1.5 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
- స్నేహ్ రాణా- రూ.75 లక్షలు (గుజరాత్ జెయింట్స్)
- అలీసా హీలీ- రూ.70 లక్షలు (యూపీ వారియర్స్)
- అనాబెల్ సదర్లాండ్- రూ.70 లక్షలు (గుజరాత్ జెయింట్స్)
- డయాండ్రా డాటిన్- రూ.60 లక్షలు (గుజరాత్ జెయింట్స్)
- శిఖా పాండే- రూ.60 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
- హర్లీన్ డియోల్- రూ.40 లక్షలు (గుజరాత్ జెయింట్స్)
- రాజేశ్వరి గైక్వాడ్-రూ.40 లక్షలు (యూపీ వారియర్స్)
- రాధా యాదవ్- రూ.40 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)