పాకిస్థాన్ పై అదరగొట్టిన జెమీమా రోడ్రిగ్స్ కు వేలంలో రూ.2.2 కోట్ల ధర
- ముంబయిలో డబ్ల్యూపీఎల్ వేలం
- జెమీమాను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
- యువ బ్యాటర్ షెఫాలీ వర్మకు రూ.2 కోట్లు
- దీప్తి శర్మకు రూ.2.60 కోట్ల ధర
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆటగాళ్ల వేలం ముంబయిలో కొనసాగుతోంది. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ కు వేలంలో భారీ ధర లభించింది. జెమీమా కనీస ధర రూ.50 లక్షలు కాగా... ఆమెను రూ.2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.
ఇంగ్లండ్ క్రీడాకారిణి నటాలీ షివర్ ను రూ.3.20 కోట్లతో ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆమె ప్రారంభ ధర రూ.50 లక్షలు. ఇక, ఇటీవల తన అద్భుత నాయకత్వంతో భారత్ కు అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ అందించిన యువ బ్యాటర్ షెఫాలీ వర్మకు వేలంలో రూ.2 కోట్ల ధర లభించింది. ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
ఇతర కొనుగోళ్ల వివరాలు...

- దీప్తి శర్మ- రూ.2.60 కోట్లు (యూపీ వారియర్స్)
- తహ్లియా మెక్ గ్రాత్- రూ.1.4 కోట్లు (యూపీ వారియర్స్)
- రేణుకా సింగ్- రూ.1.50 కోట్లు (ఆర్సీబీ)
- బెత్ మూనీ- రూ.2 కోట్లు (గుజరాత్ జెయింట్స్)
- షబ్నిమ్ ఇస్మాయిల్- రూ.1 కోటి (యూపీ వారియర్స్)
- అమేలియా కెర్- రూ.1 కోటి (ముంబయి ఇండియన్స్)
- సోఫీ డంక్లీ- రూ.60 లక్షలు (గుజరాత్ జెయింట్స్)
- మెగ్ లానింగ్- రూ.1.10 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)