కొత్త ట్రాఫిక్ రూల్స్.. హెల్మెట్ సరిగ్గా పెట్టుకోకపోయినా చలానా పడుద్ది!

  • హెల్మెట్ ధరించకపోతే నిబంధనల కింద రూ.2,000 జరిమానా
  • హెల్మెట్ స్ట్రిప్ లాక్ చేయకపోతే రూ.1,000
  • బీఐఎస్ మార్క్ లేని హెల్మెట్ కు మరో రూ.1,000
కొత్త ట్రాఫిక్ నిబంధనలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వాహనాన్ని నడపాలి. ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కితే పెద్ద మొత్తంలో పర్స్ ఖాళీ అవుతుంది. సాధారణంగా హెల్మెట్ పెట్టుకోకపోతే మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం రూ.2,000 వరకు జరిమానాని ట్రాఫిక్ పోలీసులు విధించొచ్చు. హెల్మెట్ పెట్టుకున్నా ఈ చలానా చెల్లించాల్సి రావచ్చు.

ఎలా అంటే హెల్మెట్ తలకు తగిలించుకుంటే సరిపోదు. హెల్మెట్ ను మన తలకు ఫిక్స్ చేసే ట్యాగ్ ను (స్ట్రిప్) సైతం లాక్ చేయాలి. లేదంటే సెక్షన్ 194డీ ఎంవీఏ కింద రూ.1,000 చలానాని పోలీసులు విధిస్తారు. అలాగే, బీఐఎస్ గుర్తింపులేని ఏదో ఒక హెల్మెట్ పెట్టుకున్నా కుదరదు. అందుకు సైతం పోలీసులు మరో రూ.1,000 చలానా విధించొచ్చని చట్టం చెబుతోంది. 



More Telugu News