ఆ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి: జీవీఎల్ డిమాండ్
- రాజ్యసభలో రంగా ప్రస్తావన తెచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్
- కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్
- విజయవాడ ఎయిర్‌పోర్టుకూ వంగవీటి పేరు పెట్టాలని అభ్యర్థన
కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు నేడు రాజ్యసభలో కేంద్రాన్ని కోరారు. తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితమైన వంగవీటి రంగా పేరును జిల్లాకు పెట్టాలని కోరినా రాష్ట్రం ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. విజయవాడ విమానాశ్రయానికి కూడా రంగా పేరు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
‘‘వంగవీటి మోహన రంగా గారి గురించి తెలియని తెలుగువారు ఉండరు. రాష్ట్రంలోని ఓ జిల్లాకు ఆయన పేరు పెట్టాలన్న ప్రతిపాదన ప్రజల్లో ఉంది. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. రాష్ట్రంలో ఇతర నాయకుల పేర్లు జిల్లాలకు పెట్టారు కానీ వంగవీటి రంగా పేరు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకో మనస్సు రావట్లేదు. రంగా పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా కృష్ణా లేదా ఏదో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని సభాముఖంగా కోరుతున్నాను. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు కూడా వంగవీటి మోహనరంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా నామకరణం చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరుతున్నాను’’ అని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.