వెలమ కులద్రోహి అయ్యన్నపాత్రుడు: టీడీపీ రెబెల్ నేత శ్రీరామ్మూర్తి

  • కులం మీద బతికే వ్యక్తి అయ్యన్న అంటూ శ్రీరామ్మూర్తి విమర్శ
  • తనను రాజకీయంగా ఎదగనీయడం లేదని మండిపాటు
  • ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినా ఎమ్మెల్సీగా గెలుస్తానని ధీమా
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై టీడీపీ రెబెల్ నేత ఈర్లె శ్రీరామ్మూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడు కులం కోసం బతికే నేత కాదని... కులం మీద బతికే వ్యక్తి అని విమర్శించారు. ఆయన వెలమ కులద్రోహి అని మండిపడ్డారు. రాజకీయంగా తనను ఎదగనీయడం లేదని, అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రెవెన్యూ ఉద్యోగానికి 2018లో తాను రాజీనామా చేశానని... అప్పటి నుంచి టీడీపీకి సేవలందిస్తున్నానని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని తనకు గతంలో హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారని అన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానానికి శ్రీరామ్మూర్తి పోటీ పడుతున్న విషయం గమనార్హం. 

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉండటం వల్లే అయ్యన్నపాత్రుడు తనపై కక్ష సాధిస్తున్నారని శ్రీరామ్మూర్తి అన్నారు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఉపాధ్యాయ సంఘాలు, పట్టభద్రులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అయ్యన్నది ఉత్తరాంధ్ర కాదని... ఆయనది కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని అల్లిపూడి గ్రామం అని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వలస నేతలు పాలిస్తున్నారని చెప్పే అర్హత అయ్యన్నకు లేదని చెప్పారు.


More Telugu News