ఆ రోజు ఏం జరిగిందంటే: ఘంటసాల తనయుడు రవికుమార్!

  • ఘంటసాల రెండో భార్య సరళ 
  • ఆమె తనయుడు రవి కుమార్ 
  • ఘంటసాల మరణం గురించిన ప్రస్తావన 
  • ఆయన సేవచేసుకునే భాగ్యం కలిగిందన్న రవికుమార్

తెలుగు తెరపై పద్యాన్నీ .. పాటను పరుగులు తీయించిన గాయకుడు ఘంటసాల. ఆయన కుమారులలో రవికుమార్ ఒకరు. ఎక్కువగా బయట కనిపించని రవికుమార్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ .. "నాన్నగారు చనిపోయే సమయానికి నాకు 18 ఏళ్లు ఉంటాయి. చనిపోవడానికి కొంతకాలం ముందు నుంచే ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారు" అన్నారు. 

" ఆ రోజున నేను ఆయనను చూడటానికి హాస్పిటల్ కి వెళ్లాను. 'కాస్త కాళ్లు పట్టు నాయనా' అని ఆయన అంటే, కాళ్లు పడుతూ అక్కడే కూర్చున్నాను. మంచినీళ్లు ఇవ్వమని అడిగితే ఇచ్చాను .. ఆ తరువాత పడుకుని .. దుప్పటి కప్పేసి వెళ్లమన్నారు. దుప్పటి కప్పేసి నేను బయటికి వచ్చాను. నిజానికి నేను అక్కడి నుంచి నా ఇనిస్టిట్యూట్ కి వెళ్లవలసి ఉంది .. కానీ వెళ్లబుద్ధి కాలేదు. దాంతో ఇంటికి వచ్చేశాను" అన్నారు. 

" ఆ వెంటనే ఆయన పోయారంటూ హాస్పిటల్ నుంచి కబురు వచ్చింది. చివరి నిమిషంలో కూడా ఆయన సేవ చేసుకోగలిగాననే సంతృప్తి మిగిలింది. నాన్నగారికి మా అమ్మగారు 'సరళ' రెండో భార్య. నాన్నగారు పోయాక మా మేనమామల అండదండలు ఉండేవి. అందువలన మేము ఆర్ధికంగా ఇబ్బందులేం పడలేదు" అని చెప్పుకొచ్చారు. 




More Telugu News