రైల్వే భూమిని హనుమంతుడు ఆక్రమించాడట.. ఖాళీ చేసి వెళ్లాలంటూ నోటీసులు

  • మధ్యప్రదేశ్‌లోని మురైనా జిల్లాలో ఘటన
  • కొత్త రైల్వే లైనుకు అడ్డంకిగా మారిన హనుమాన్ ఆలయం
  • తక్షణం ఖాళీ చేయాలంటూ హనుమంతుడి పేరిట నోటీసులు
  • పొరపాటు జరిగిందన్న అధికారులు
అవును! రైల్వే భూమిని హనుమంతుడు ఆక్రమించాడట. వెంటనే ఖాళీ చేయాలని, లేదంటే తదుపరి చర్యలు తప్పవంటూ మధ్యప్రదేశ్ అధికారులు నోటీసులు పంపారు. మురైనా జిల్లాలోని సబల్‌గఢ్‌లో కొత్త రైల్వే లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గ్వాలియర్-షియోపూర్ మధ్య ఏర్పాటు చేస్తున్న ఈ లైనుకు ఓ హనుమాన్ గుడి అడ్డంగా మారింది. దీంతో అధికారులు ఏ మాత్రం తడుముకోకుండా వెంటనే హనుమంతుడికి నోటీసులు పంపించారు. 

కొత్తగా రైల్వే లైన్ వేస్తున్నాం కాబట్టి తక్షణం అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ ఆంజనేయుడికి అధికారులు నోటీసులు పంపారు. రైల్వే భూమిని హనుమంతుడు ఆక్రమించినట్టు పేర్కొంటూ ఈ నెల 8న ఝాన్సీ రైల్వే డివిజన్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ నోటీసులు జారీ చేశారు.

హనుమంతుడికి నోటీసు విషయం వైరల్ అయి అధికారుల తీర్పుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన అధికారులు..  ఆలయ యజమానికి నోటీసులు ఇవ్వాలని, కానీ, పొరపాటు జరిగినట్టు ఝాన్సీ రైల్వే డివిజన్ పీఆర్వో మనోజ్ మాథుర్ పేర్కొన్నారు.



More Telugu News