'వినరో భాగ్యము విష్ణుకథ'లో హైలైట్ సీన్ అదే: ప్రీ రిలీజ్ ఈవెంటులో కిరణ్ అబ్బవరం
- కిరణ్ అబ్బవరం హీరోగా 'వినరో భాగ్యము విష్ణుకథ'
- తిరుపతి నేపథ్యంలో నడిచే కథ
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అని చెప్పిన కిరణ్
- ఆడియన్స్ అంచనాలకి ఎంతమాత్రం తగ్గదని వ్యాఖ్య
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా నిర్మితమైంది. కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును 'తిరుపతి'లో నిర్వహించారు. ఈ వేదికపై కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. "ఈ సినిమాలో తిరుపతిపై ఒక ప్రత్యేకమైన పాట ఉంది. అలాంటి పాట మా సినిమాలో ఉండటం మేము పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమని అనుకుంటున్నాము" అన్నాడు.
"ఒకప్పుడు ఇదే బ్యానర్లో తిరుపతిలో 'జల్సా' రిలీజ్ అయితే ఎంతో కష్టపడి టికెట్ సంపాదించుకుని చూశాను. ఇప్పుడు అదే బ్యానర్లో నేను హీరోగా చేసిన సినిమా వస్తుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమంచి అవకాశం నాకు ఇచ్చినందుకు అల్లు అరవింద్ గారికీ .. బన్నీవాసు గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాలో తిరుపతిని ఎంత బాగా చూపించామనేది ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది" అని చెప్పాడు.
"గోవిందరాజ స్వామి గుడి దగ్గర ఒక ఫైట్ ఉంటుంది .. ఆ ఫైట్ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో పూనకాలే. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ ఒక రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఈ సినిమా మీ అంచనాలకి ఎంతమాత్రం తగ్గదు. ఈ నెల 18వ తేదీన వస్తున్న ఈ సినిమాను చూసి ఎలా ఉందనేది చెప్పండి" అంటూ ముగించాడు.