అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు డీసీజీఐ నోటీసులు

  • లైసెన్స్ లేకుండా ఔషధాల అమ్మకాలు
  • మొత్తం 20 సంస్థలకు నోటీసులు
  • రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
నిబంధనలు పాటించకుండా ఆన్ లైన్ లో ఔషధాల అమ్మకాలు సాగిస్తున్న 20 ఈ-కామర్స్ సంస్థలకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న పోర్టళ్లలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. నిర్దిష్ట లైసెన్స్ లేకుండా ఆన్ లైన్ లో ఔషధాల అమ్మకాలను నిషేధిస్తూ  2018 డిసెంబరు 12న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ డీసీజీఐ వీజీ సోమానీ ఈ నోటీసులు జారీ చేశారు. 

కోర్టు ఉత్తర్వులను 2019 మే, నవంబరు మాసాల్లో అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించడం జరిగిందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 2020 ఫిబ్రవరిలోనూ మరోసారి ఆ ఉత్తర్వులను పంపించినట్టు వివరించారు. 

లైసెన్స్ లేని అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ సదరు సంస్థలు ఆన్ లైన్ అమ్మకాలు సాగిస్తున్నట్టు గుర్తించామని డీసీజీఐ వెల్లడించింది. రెండ్రోజుల్లో నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.


More Telugu News