టీ20 వరల్డ్ కప్: పాకిస్థాన్ ను 149 పరుగులకే కట్టడి చేసిన భారత అమ్మాయిలు
- దక్షిణాఫ్రికాలో మహిళల టీ20 వరల్డ్ కప్
- కేప్ టౌన్ లో భారత్ వర్సెస్ పాక్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
- రాణించిన బిస్మా, ఆయేషా
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. కేప్ టౌన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసింది.
ఆ జట్టు కెప్టెన్ బిస్మా మారూఫ్ బాధ్యతాయుతంగా ఆడి 55 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె స్కోరులో 7 బౌండరీలు ఉన్నాయి. చివర్లో ఆయేషా నసీమ్ ధాటిగా ఆడడంతో పాక్ కు ఆ మాత్రమైనా స్కోరు వచ్చింది. ఆయేషా 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేసింది.
టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్ 2, దీప్తి శర్మ 1, పూజా వస్త్రాకర్ 1 వికెట్ తీశారు.
అనంతరం 150 పరుగుల లక్ష్యఛేదనలో భారత అమ్మాయిలు 7 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 49 పరుగులు సాధించారు. ఓపెనర్ యస్తికా భాటియా 17 పరుగులు చేసి సాదియా ఇక్బాల్ బౌలింగ్ లో అవుటైంది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ షెఫాలీ వర్మ 28, జెమీమా రోడ్రిగ్స్ 3 పరుగుతోనూ ఆడుతున్నారు. భారత్ గెలవాలంటే 78 బంతుల్లో 101 పరుగులు చేయాలి.