తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

  • వారాంతం కారణంగా భారీగా తరలివచ్చిన భక్తులు
  • నిన్న ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న 75,728 మంది
  • హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం
  • నిండిపోయిన అన్ని కంపార్ట్ మెంట్లు
  • సర్వదర్శనానికి 30 గంటల సమయం
వారాంతం కారణంగా తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆదివారాల్లో భక్తులు తిరుమల కొండకు భారీగా తరలివచ్చారు. నిన్న స్వామివారిని 75,728 మంది భక్తులు దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా 38,092 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 

నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం వచ్చింది. టికెట్ లేని సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోగా, భక్తులు టీబీసీ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.


More Telugu News