కెనడా గగనతలంలో మరో అనుమానాస్పద వస్తువు.. కూల్చేసిన అమెరికా యుద్ధ విమానాలు
- కెనడా, అమెరికా వాయుసేనల సంయుక్త ఆపరేషన్
- అనుమానాస్పద వస్తువును కూల్చేసిన అమెరికా ఫైటర్ జెట్స్
- తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామన్న కెనడా రక్షణ మంత్రి
ఉత్తర అమెరికాలో అనుమానాస్పద వస్తువుల కలకలం కొనసాగుతోంది. తాజాగా కెనడాలోని యూకాన్ ప్రాంత గగనతలంలో గొట్టం ఆకారంలో ఉన్న ఓ వస్తువును అమెరికా ఫైటర్ జెట్లు కూల్చేశాయి. ఈ విషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ధ్రువీకరించారు. అమెరికా, కెనడా వాయుసేనలు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో దాన్ని కూల్చేసినట్టు తెలిపారు. ‘‘అనుమానాస్పద వస్తువును గుర్తించగానే అమెరికా, కెనడా యుద్ధ విమానాలు తమ లక్ష్యం దిశగా దూసుకుపోయాయి. అమెరికా ఎఫ్-22 విమానాలు దాన్ని కూల్చేశాయి’’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ విషయమై కెనడా ప్రధాని.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చించారు. కెనడా రక్షణ మంత్రి అనితా ఆనంద్ కూడా అమెరికా డిఫెన్స్ సెక్రెటరీ లాయిడ్ ఆస్టిన్‌తో చర్చలు జరిపారు. తమ సార్వభౌమత్వాన్ని ఇరు దేశాలు సంయుక్తంగా కాపాడుకుంటాయని కెనడా మంత్రి అనిత ట్విట్టర్‌లో ప్రకటించారు.
అమెరికాలోని అలాస్కాలో ఓ అనుమానాస్పద వస్తువును కూల్చిన మరుసటి రోజే కెనడాలో మళ్లీ అదే కలకలం రేగడంతో ఇరు దేశాలు అప్రమత్తమయ్యాయి. అయితే.. అలాస్కా ఘటనపై అమెరికా రక్షణ కార్యాలయం పెంటాగాన్ పూర్తి వివరాలు వెల్లడించలేదు. గగనతలంలో 40 వేల అడుగుల ఎత్తులో కారు ఆకారంలో ఉన్న ఓ వస్తువును కూల్చేశామన్న ప్రకటనతో సరిపుచ్చింది. వస్తువు తాలూకు శిథిలాలను పరీక్షిస్తున్నట్టు తెలిపింది.