తారకరత్నకు వైద్యం కోసం విదేశీ వైద్యులు!
- లోకేశ్ పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లి గుండెపోటుకు గురైన తారకరత్న
- బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
- విదేశాల నుంచి వైద్యులను రప్పించినట్టు చెప్పిన రామకృష్ణ
గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్నకు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యుడు నందమూరి రామకృష్ణ తెలిపారు. విదేశీ వైద్యులను రప్పించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. హృద్రోగంతోపాటు నాడీ సమస్యలకు వారు చికిత్స చేస్తున్నట్టు వివరించారు.
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వెళ్లిన తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీంతో తొలుత కుప్పం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు తొలుత తారకరత్నపరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరింత మెరుగైన చికిత్స కోసం ఆయనను విదేశాలకు తరలిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఇప్పుడు విదేశాల నుంచే వైద్యులను రప్పించి చికిత్స అందిస్తున్నారు.