పిల్లలకు పొద్దున్నే ఇవ్వతగిన బెస్ట్ ఫుడ్స్

  • బాదం, అరటి పండు, యాపిల్ ఇవ్వొచ్చు
  • ఉసిరికాయలతో హల్వా చేసి ఇవ్వడం మరింత బలవర్ధకం
  • గోరు వెచ్చని నీటితోనూ ప్రయోజనాలు
టీనేజ్ పూర్తయ్యే వరకు పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల కొనసాగుతూనే ఉంటుంది. పైగా వారు మేధస్సుతో చదువుల్లోనూ రాణించాలి. కనుక చిన్నారులకు పోషకాలతో కూడిన ఆహారం అందించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. నేడు చాలా మంది చిన్నారులు స్నాక్స్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటితో అధిక సాల్ట్, చెడు కొవ్వులు (ట్రాన్స్ ఫ్యాట్), అధిక కేలరీలు శరీరంలోకి చేరి బరువు పెరగడానికి, అనారోగ్యాలకు కారణమవుతోంది. కానీ, వీటి నుంచి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు పెద్దగా అందవు. కనుక ఇలాంటివి పక్కన పెట్టేసి పిల్లలకు ప్రతి రోజు ఉదయం ఇవ్వతగిన అద్భుతమైన ఆహార పదార్థాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రులు వీటిపై ఓ సారి దృష్టి పెట్టాలి.

బాదం
బాదంలో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే, ఐరన్, ఫైబర్, విటమిన్ ఈ కూడా లభిస్తాయి. బాదం తినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. శరీరం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తికి ఇవి మంచివి.

అరటి పండు
అరటి పండ్లలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. జింక్, సోడియం, ఐరన్ కూడా లభిస్తాయి. అరటి పండ్లు పెట్టడం వల్ల పిల్లల్లో ఎముకల పుష్టి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా బలపడుతుంది.

ఉసిరి హల్వా
ఉసిరికాయలతో హల్వా చేసి పిల్లలకు ఇవ్వడం ఎంతో బలవర్ధకం. క్యాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్ సీ దీని నుంచి లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. కంటి చూపునకు కూడా మేలు చేస్తుంది.

యాపిల్
యాపిల్ లో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, జింక్ లభిస్తాయి. పిల్లలకు పొద్దున్నే యాపిల్ ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. 

వేడి నీరు
గోరువెచ్చని నీటిని పొద్దున్నే పిల్లలకు ఇవ్వడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రుతువుల వారీ వచ్చే వ్యాధులను దూరం పెట్టొచ్చు. జీవక్రియలు చురుకుదనం సంతరించుకుంటాయి. 



More Telugu News