'సార్' కథ వినగానే ధనుశ్ ఒక్కటే ఒక మాటన్నారు: వెంకీ అట్లూరి
- వెంకీ అట్లూరి నుంచి వస్తున్న 'సార్'
- ధనుశ్ సరసన సందడి చేయనున్న సంయుక్త మీనన్
- బాణీలను అందించిన జీవీ ప్రకాశ్ కుమార్
- ఈ నెల 17వ తేదీన విడుదలవుతున్న సినిమా
ప్రేమకథా చిత్రాలలో తన ప్రత్యేకతను చాటుకున్న వెంకీ అట్లూరి, తన తాజా చిత్రంగా 'సార్' సినిమాను రూపొందించాడు. సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ .. "ధనుశ్ నేరుగా తెలుగులో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. ఆ సమయంలోనే నేను ఆయనకి కథను వినిపించాను. ధనుశ్ కథకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ముందుగా ఆయన స్క్రిప్ట్ మాత్రం అడుగుతారు. అది ఆయనకి ఇస్తే సరిపోతుంది" అని అన్నారు.
"ధనుశ్ కి కథ నచ్చితే చాలు .. ఆ దర్శకుడు ఇంతకుముందు ఏం తీశాడు? ఇప్పుడు ఏ భాషలో చేస్తాడు? అనేది కూడా ఆయన పట్టించుకోరు. నేను ఇచ్చిన స్క్రిప్ట్ చదివిన తరువాత 'డేట్స్ ఎప్పుడు కావాలి?' అన్నారు. ఆయన అంత త్వరగా ఒప్పుకుంటాడని నేను అనుకోలేదు. అందువల్లనే షాక్ అయ్యాను" అంటూ చెప్పుకొచ్చారు.