మెగా సబ్జెక్ట్ పైనే కసరత్తు చేస్తున్న పూరి!

  • గతంలో చిరూతో 'ఆటో జానీ' చేయాలనుకున్న పూరి
  • కొన్ని కారణాల వలన సెట్ కానీ ప్రాజెక్టు  
  •  రీసెంటుగా చిరూకి కథను వినిపించిన పూరి
  • మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్

చిరంజీవి హీరోగా 'ఆటో జానీ' సినిమా చేయాలని ఆ మధ్య పూరి జగన్నాథ్ అనుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన అది కుదరలేదు. ఆ తరువాత ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీ అయ్యారు. ఆ మధ్య తనతో సినిమా ఎప్పుడు చేస్తావని పూరిని మెగాస్టార్ అడగడం .. మరో మంచి కథతో వస్తానని పూరి చెప్పడం అంతా విన్నదే. 

ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా ఖరారైనట్టేననే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల చిరంజీవిని కలిసిన పూరి కథ చెప్పడం .. ఓకే అంటూనే చిరంజీవి కొన్ని మార్పులు చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు.  

ఇక పూరి పనిలో పనిగా బాలయ్యను కూడా లైన్లో పెట్టేశాడని అంటున్నారు. అనిల్ రావిపూడితో బాలయ్య ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఈ సినిమా ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తానికి పూరి, సీనియర్ స్టార్ హీరోలతో ప్రాజెక్టులను ఓకే చేయించుకుంటూ వెళుతున్నాడు. ఇక ఎవరిని ఏ జోనర్లో చూపిస్తాడనేది చూడాలి.  



More Telugu News