మహేశ్ బాబు హైదరాబాదులో లేరు... అందుకే రేసింగ్ కు రావడంలేదు: నమ్రత
- హైదరాబాదులో ఫార్ములా-ఇ రేసింగ్
- నేడు ప్రాక్టీసు రేసు
- రేసింగ్ ట్రాక్ ను సందర్శించిన మహేశ్ బాబు అర్ధాంగి
- తమకు రేసింగ్ అంటే చాలా ఇష్టమని వెల్లడి
ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఇ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ చాంపియన్ షిప్ కు హైదరాబాద్ నగరం ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ప్రాక్టీసు రేసుతో టోర్నీ ప్రారంభం కానుంది. రేపు మెయిన్ రేసు నిర్వహించనున్నారు. కాగా, నగరంలోని రేసింగ్ ట్రాక్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత శిరోద్కర్ నేడు సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాదులో ఫార్ములా-ఇ రేసింగ్ జరగడం చాలా సంతోషాన్నిస్తోందని అన్నారు. "నాకు, మా అబ్బాయి గౌతమ్ కు రేసింగ్ అంటే ఎంతో ఆసక్తి. కానీ ఎప్పుడూ రేసింగ్ ఈవెంట్లకు వెళ్లలేదు. రేపు హైదరబాదులో జరగనున్న ఇ-రేసింగ్ ను గౌతమ్ చూడాలని ఎదురుచూస్తున్నాడు. మహేశ్ బాబు ప్రస్తుతం హైదరాబాదులో లేరు... అందుకే రేసింగ్ కు రావడంలేదు" అని వివరించారు.
అటు, ఈ సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాదులోని రేస్ ట్రాక్ వద్ద ప్రాక్టీసు రేసు జరగాల్సి ఉండగా, ట్రాక్ పైకి ప్రైవేటు వాహనాలు వచ్చాయి. దాంతో ప్రాక్టీసు రేసు ఇంకా ప్రారంభం కాలేదు. ట్రాక్ లోకి ఇతర వాహనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసినా, ప్రైవేటు వాహనదారులు బారికేడ్లు తొలగించి ట్రాక్ పై ప్రయాణించారు.