అవయవదానం చేసే ఖైదీలకు శిక్ష తగ్గింపు ప్రతిపాదన.. కొత్త బిల్లుతో అమెరికాలో కలకలం

  • కొత్త బిల్లును ప్రతిపాదించిన మసాచుసెట్స్ రాష్ట్ర చట్టసభ్యులు
  • అవయవదానం చేసిన ఖైదీలకు శిక్ష తగ్గించాలంటూ ప్రతిపాదన
  • ఇది అనైతికమంటున్న పరిశీలకులు
మానవత్వం కనబరిచిన ఖైదీల శిక్ష తగ్గించేందుకు ఉద్దేశించిన ఓ బిల్లు ప్రస్తుతం అమెరికాలో తీవ్ర దుమారం రేపుతోంది. అవయవదానం లేదా బోన్ మ్యారో(ఎముక మూలుగ)ను దానం చేసిన ఖైదీల శిక్ష తగ్గించాలనేది ఈ బిల్లు లక్ష్యం. మసాచుసెట్స్ రాష్ట్ర చట్టసభ సభ్యులు కొందరు ఈ బిల్లును ప్రతిపాదించారు. అయితే.. బిల్లులో గరిష్ఠంగా ఏడాది పాటు మాత్రమే శిక్ష తగ్గించేందుకు అవకాశం ఉండటం గమనార్హం. 

ప్రతిపాదిత బిల్లుపై మసాచుసెట్స్ రాష్ట్రంలో పెను కలకలం రేగుతోంది. ఇది అనైతికమని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిఫలాపేక్షతో అవయవదానం చేయడాన్ని నిషేధించిన ఫెడరల్ ప్రభుత్వ చట్టానికి ఇది వ్యతిరేకమని కూడా అంటున్నారు. మరోవైపు.. అవయవదానం తరువాత ఖైదీలకు జైళ్లలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం అధికారుల ముందున్న మరో సవాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

మసాచుసెట్స్ జైళ్లలోని ఖైదీల్లో అధికశాతం నల్లజాతీయులు, లాటిన్ అమెరికా సంతతి వారే. దీంతో.. ఈ బిల్లుతో మైనారిటీలకు అన్యాయం జరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పాలక పక్ష, ప్రతిపక్ష పార్టీ సభ్యుల్లో కొందరు ఉమ్మడిగా ఈ బిల్లును ప్రతిపాదించారు. ఇదిలా ఉంటే.. సభలో బిల్లుకు ఆమోదం లభించడం అంత సులువేమీ కాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

USA

More Telugu News