నేడు కూడా వాడీవేడిగా లోకేశ్ యువగళం పాదయాత్ర... హైలైట్స్ ఇవిగో!

  • జీడీ నెల్లూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • పోలీసుల తీరుపై లోకేశ్ ఆగ్రహం
  • చేతిలో రాజ్యాంగంతో నిరసన
  • మూల్యం చెల్లించకతప్పదంటూ పోలీసులకు వార్నింగ్
  • వివిధ వర్గాలతో భేటీ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇవాళ కూడా లోకేశ్ పాదయాత్ర వాడీవేడిగా సాగింది. సంసిరెడ్డిపల్లెలో పోలీసుల వైఖరి పట్ల లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. 

డీఎస్పీ ప్రసాద్ వందమందికి పైగా పోలీసులతో అక్కడికి చేరుకోగా, తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. లోకేశ్ మాట్లాడేందుకు బాషా అనే కార్యకర్త మైక్ తీసుకువస్తుండగా, అతడి నుంచి పోలీసులు మైక్ లాక్కున్నారంటూ టీడీపీ వర్గాలు ఆరోపించాయి. టీడీపీ వాణిజ్యం విభాగం నేత డూండీ రాకేశ్ పోలీసులను నిలదీసేందుకు ప్రయత్నించగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి లోకేశ్ ఓ స్టూలుపై నిలబడి ప్రసంగించారు.

చేతిలో రాజ్యాంగంతో లోకేశ్ నిరసన

  • పోలీసులు రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం తనను అడ్డుకుంటున్నారో చెప్పాలన్న లోకేశ్
  • రాజ్యాంగం పుస్తకం చేతపట్టుకుని లోకేశ్ నిరసన
  • రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయడానికి మీరెవరు అంటూ ఆగ్రహం
  • ప్రజాస్వామ్యబద్ధంగా యాత్ర సాగిస్తున్నానన్న టీడీపీ యువనేత
  • పోలీసులను నిలదీసిన సంసిరెడ్డిపల్లె గ్రామస్తులు
  • మా ఊర్లో లోకేశ్ ను మాట్లాడొద్దనడానికి మీరెవరు అంటూ పోలీసులపై తిరగబడిన వైనం
  • నర్సింగరాయపేట పోలీస్ స్టేషన్ లోకేశ్ పై కేసు నమోదు 

రంగాపురం క్రాస్ వద్ద లోకేశ్ బహిరంగ సభ

  • ప్రజాస్వామ్యయుతంగా యాత్ర చేస్తున్నానన్న లోకేశ్
  • నిబంధనలు అతిక్రమించి యాత్రను అడ్డుకునే పోలీసులు జైలుకెళ్లక తప్పదని వెల్లడి
  • సహకరిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు
  • దమ్ముంటే నువ్వు నేరుగా రా... ఎంతమందినైనా తెచ్చుకో... పోరాటానికి పసుపు సైన్యం సిద్ధంగా ఉందని వెల్లడి
  • జనాన్ని చూస్తే నీకు వణుకొస్తుంది... అదే జనాన్ని చూస్తే నాకు ఊపొస్తుంది
  • సంసిరెడ్డిపల్లెలో మైక్ లో మాట్లాడకపోయినా ఓ డీఎస్పీ నా మైక్ లాక్కుపోయాడు
  • ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1 మాకు ఒకవిధంగా, వైసీపీకి ఒకవిధంగా పనిచేస్తోంది
  • అమరావతిలో రఘురామరెడ్డి అనే ఎస్పీ నా పాదయాత్రపై నిఘా వేశాడు. ఆయనకు ఇదే చెబుతున్నా.... ప్రతి అంశాన్ని లైవ్ ఇస్తున్నా చూస్కో... టీడీపీ అధికారంలోకి వచ్చాక మీ అంతు చూసేది నేనే
  • గతంలో జగన్ ను నమ్ముకున్న అధికారులు జైలుకు వెళ్లారు. చట్టాన్ని అతిక్రమిస్తే మీకు కూడా అదే గతి పడుతుంది. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి.
  • టీడీపీ పాలనలో అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించాం. 
  • రాయలసీమలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుది
  • 2019లో జగన్ రోడ్డు మీదికి వచ్చి ఒక్క చాన్స్ అంటూ అడుక్కుని ముఖ్యమంత్రి అయ్యాడు.
  • అధికారంలోకి వచ్చాక ప్రజల పాలిట రాక్షసుడయ్యాడు. అందుకే జగన్ కు మరో పేరు రాక్షస రెడ్డి
  • చంద్రబాబు సీఎం అయినప్పుడు జగన్ ది పాలుతాగే వయసు. జగన్ కు పాలనలో ఓనమాలు తెలియవు. 
  • కానిస్టేబుళ్లు, ఎస్సై, సీఐ, డీఎస్పీలకు ప్రభుత్వం బాకీ ఉంది. మీ మెడికల్ రీయింబర్స్ మెంట్ ను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. 
  • వివేకా హత్య కేసును చంద్రబాబుపైకి నెట్టారు
  • ఇప్పుడు సీబీఐ వాళ్లు జగన్, భారతిరెడ్డి కోసం చూస్తున్నారు
  • గొడ్డలిపోటు, కోడికత్తి మొత్తం జగన్ ఆడిన డ్రామాలే.
  • రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోగా మోటార్లకు మీటర్లతో రాయలసీమ రైతుల మెడలకు ఉరితాళ్లు బిగిస్తున్నారు
  • మోటార్లకు మీటర్లు పెడితే పగలగొట్టండి
  • స్థానిక మంత్రి నారాయణ స్వామి... పెద్దిరెడ్డి వెనుక చేతులు కట్టుకుని నిలబడడం తప్ప కనీసం వారివద్ద కూర్చునే పరిస్థితి లేదు. 
  • నారాయణస్వామి తన పదవి కోసం దళితుల ఆత్మగౌరవాన్ని పెద్దిరెడ్డి కాళ్ల వద్ద తాకట్టుపెట్టాడు.

కడపగుంటలో లోకేశ్ ను కలిసిన చేతివృత్తి కళాకారులు

  • తమ సమస్యలు లోకేశ్ కు వివరించిన తెల్లజిల్లేడు వినాయక విగ్రహాలు తయారుచేసే కళాకారులు
  • ప్రస్తుత ప్రభుత్వం సబ్సిడీలు, లోన్లు, యంత్ర సామగ్రి ఇవ్వడంలేదని లోకేశ్ కు తెలిపిన కళాకారులు
  • టీడీపీ ప్రభుత్వం వచ్చాక తప్పకుండా ఆదుకుంటామని లోకేశ్ హామీ
  • ఎస్పీ కార్పొరేషన్ ద్వారా విరివిగా లోన్లు ఇప్పిస్తామని వెల్లడి 

అవల్ కొండలో దర్గా ప్రారంభించిన లోకేశ్

  • జీడీ నెల్లూరు నియోజకవర్గం అవల్ కొండలో అబ్బాసియా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అజా ఖానే-ఈ-జైహా దర్గా నిర్మాణం 
  • ప్రారంభోత్సవంలో పాల్గొన్న లోకేశ్
  • అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఆదుకుంటామని మైనారిటీలకు హామీ
  • ఇమామ్, మౌజమ్ లకు ఆర్థికసాయం అందిస్తామని వెల్లడి



More Telugu News