జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్... స్టేషన్ బెయిల్ పై విడుదల

  • పెద్దపప్పూరు రీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన
  • అక్రమ ఇసుక తవ్వకాలపై ఆగ్రహం
  • జేసీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం పెద్దపప్పూరు ఇసుక రీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని పలుచోట్లకు తిప్పిన పోలీసులు తిరిగి పెద్దపప్పూరుకు తీసుకువచ్చారు. 

బెయిల్ ఇవ్వడానికి నోటీసుపై సంతకం చేయాలని పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని కోరారు. ఇసుక అక్రమ తవ్వకాలపై తన ఫిర్యాదుకు రసీదు ఇవ్వాలని జేసీ కోరారు. జేసీ ఫిర్యాదుపై రసీదు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. అటు, పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. జేసీ అరెస్ట్ కు నిరసనలు తెలిపాయి. అనంతరం, పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.


More Telugu News