ఒక ఆర్టిస్టుగా ఆ ఇద్దరి ప్రభావం నాపై ఉంది: కమెడియన్ సునీల్

  • విలన్ వేషాల కోసమే ఇండస్ట్రీకి వచ్చానన్న సునీల్
  • ఆడియన్స్ కమెడియన్ గా ఆదరించారని వ్యాఖ్య 
  • నటనలో కోట .. డాన్సులలో మెగాస్టార్ ప్రభావం తనపై ఉందని వెల్లడి
  • తనకి నచ్చిన పాత్రలు వస్తుండటం పట్ల హర్షం  

స్టార్ కమెడియన్ గా క్రేజ్ తెచ్చుకున్న సునీల్, ఆ తరువాత హీరో వేషాల వైపు వెళ్లాడు. అక్కడి నుంచి కమెడియన్ గా టర్న్ తీసుకున్నప్పటికీ, విలక్షణమైన పాత్రలను చేస్తూ ముందుకు వెళుతున్నాడు. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలలోను .. విలన్ వేషాల్లోను ఆయన మెప్పిస్తూ వెళుతుండటం విశేషం. 

తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ .. " విలన్ వేషాలు వేయాలనే ఉద్దేశంతోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను .. కానీ నేచర్ నన్ను కమెడియన్ ను చేసింది. నేను విలన్ కావాలనుకోవడానికి కారణం కోట శ్రీనివాసరావుగారు. ఆయన ప్రభావం నాపై చాలా వుంది. ఈ విషయం చెప్పుకోవడానికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను" అని అన్నాడు.

"ఇక కాలేజ్ రోజుల నుంచి కూడా చిరంజీవిగారికి నేను వీరాభిమానిని. ఆయన డాన్సులను నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. 'అందాలరాముడు' సినిమాలో హీరోగా ఛాన్స్ రావడంతో, నాలో ఉన్న డాన్సర్ బయటికి వచ్చాడు. అలా మెగాస్టార్ ప్రభావం కూడా నా మీద ఉంది. నేను కోరుకున్న విలన్ వేషాలు కూడా దక్కుతున్నాయి గనుక నేను ఇప్పుడు హ్యాపీనే" ఆంటూ చెప్పుకొచ్చాడు.



More Telugu News