నాగపూర్ టెస్టు: అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు... కుంబ్లే రికార్డు తెరమరుగు
- భారత బౌలర్లలో వేగంగా 450 వికెట్లు తీసిన అశ్విన్
- 89 టెస్టుల్లోనే ఈ ఘనత అందుకున్న వైనం
- ఇప్పటివరకు కుంబ్లే పేరిట రికార్డు
- 93 టెస్టుల్లో 450 వికెట్లు తీసిన కుంబ్లే
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఇవాళ ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ సందర్భంగా అశ్విన్ 450 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత బౌలర్లలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రికార్డును అశ్విన్ ఇప్పుడు తన పేరిట లిఖించుకున్నాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉంది. కుంబ్లే 450 వికెట్ల మైలురాయిని చేరుకునేందుకు 93 టెస్టులు ఆడగా, అశ్విన్ తన 89వ టెస్టులోనే ఈ 450 వికెట్ల ఘనత అందుకోవడం విశేషం. నాగపూర్ టెస్టులో ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డు నెలకొల్పాడు.
అయితే ప్రపంచ క్రికెట్లో వేగంగా 450 వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్ రెండోస్థానంలో ఉన్నాడు. ఈ విషయంలో శ్రీలంక ఆఫ్ స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో నిలిచాడు. మురళీధరన్ కేవలం 80 టెస్టుల్లోనే 450 వికెట్లు పడగొట్టడం విశేషం.