చాట్ జీపీటీకి భారతీయ వెర్షన్ ఇది..: ఆనంద్ మహీంద్రా

  • చాట్ బండార్ కు చాట్ జీపీటీ కార్నర్ అంటూ పేరు
  • దీనిపై తనదైన శైలిలో స్పందించిన ఆనంద్ మహీంద్రా
  • చూడ్డానికి ఫొటోషాప్ మాదిరిగా ఉన్నా తెలివైనదని వ్యాఖ్య
చాట్ జీపీటీ అనే పదం ఇటీవల తరచూ వినిపిస్తోంది. ఇది ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బాట్ సాఫ్ట్ వేర్. యూజర్లకు కావాల్సిన సమస్త సమాచారాన్ని చాలా వేగంగా ఇంటర్నెట్ ను శోధించి అందిస్తోంది. చాట్ జీపీటీకి వస్తున్న ఆదరణతో టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మేల్కొని, తాను కూడా దీనికి పోటీ వెర్షన్ ను ‘బార్డ్ ఏఐ’ పేరుతో తీసుకొచ్చింది. 

చాట్ జీపీటీపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న సమయలో ఓ భారతీయుడు తన చాట్ బండికి ‘చాట్ జీపీటీ కార్నర్’ అని పేరు పెట్టుకుని దారిన పోయే వారందరినీ ఆకర్షిస్తున్నాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను సైతం ఈ చాట్ బండార్ ఆకర్షించింది. ఈ చాట్ స్టాల్ ఫొటోను తన ట్విట్టర్ పేజీలో ఉంచి తన స్పందన వ్యక్తం చేశారు. ‘‘ఇది చూడ్డానికి ఫొటో షాప్ మాదిరిగా ఉంది. అయినా కానీ చాలా తెలివైనది. మనం చూసిన ప్రతిదానికీ భారతీయుత అద్దడం ఎలాగో మనకు తెలుసు’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.


More Telugu News