బాలూ పోగానే తెలుగుపాట చీకటైపోయింది: ప్రముఖ గాయని సుశీల

  • గానకోకిలగా మనసులను గెలుచుకున్న సుశీల
  • ఘంటసాల గారిని చూసింది అక్కడేనని వివరణ 
  • బాలూ వచ్చిన తరువాత అంతా మారిపోయిందని వ్యాఖ్య 
  • తన కెరియర్లో ఆ రెండు సినిమాలు చాలని చెప్పిన సుశీల
తేనె కంటే సుశీల స్వరం తీయగా ఉంటుంది .. ప్రతి పాట ఆమె స్వరంలో సన్నాయిలా మ్రోగుతుంది. అలాంటి సుశీల వివిధ భాషల్లో కలుపుకుని కొన్ని వేల పాటలు పాడారు. సుశీల - ఎస్పీ బాలు కలిసి ఎన్నో పాటలను పాడారు. ఆమె అంటే ఆయనకి ఎంతో  ఆత్మీయత .. ఆయనంటే ఆమెకి ఎంతో అభిమానం. అందువల్లనే ఒకరి పేరును గురించి ఒకరు ప్రస్తావించకుండా పాటను గురించి మాట్లాడలేరు. 

తాజా ఇంటర్వ్యూలో సుశీల మాట్లాడుతూ ..  "ఇంతవరకూ ఎన్నో వేల పాటలు పాడాను. పాడటం ఎప్పుడూ అలసటగా అనిపించేది కాలేదు. నేను .. బాలు కలిసి ఒక రికార్డింగ్ థియేటర్ నుంచి మరో రికార్డింగ్ థియేటర్ కు పరుగులు పెడుతూ ఉండేవాళ్లం. మహాత్ముడు బాలు ఎక్కడ ఉన్నాడోగానీ, ఆయన పోయిన తరువాత ఫిల్మ్ ఫీల్డ్ చీకటైపోయింది .. అది ఆయన ప్రత్యేకత" అన్నారు. 

ఘంటసాల గారు మా ఊళ్లోనే చదువుకున్నారు. కానీ నేను ఆయనను అక్కడ చూడలేదు. మద్రాసు వచ్చిన తరువాతనే ఏవీఎమ్ స్టూడియోలో చూశాను. ఆయనతో కలిసి 'భూ కైలాస్' సినిమా కోసం అనుకుంటాను .. ఫస్టు సాంగ్ పాడాను.  ఒక వైపున పులిలా ఒక మైకు ముందు ఘంటసాల గారు .. మరో మైకు ముందు నేను. ఆ రోజులను తలచుకుంటే ఎలా పాడానా అనిపిస్తుంది.  నా కెరియర్ గురించి చెప్పుకోవాలంటే 'లవ కుశ' .. 'భక్త ప్రహ్లాద' ఈ రెండు సినిమాలు చాలు" అని చెప్పుకొచ్చారు. 
 


More Telugu News