శ్రీనగర్ లో థియేటర్లు హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయి: మోదీ
- పార్లమెంట్ ప్రసంగంలో ప్రస్తావించిన ప్రధాని
- పఠాన్ సినిమాను మోదీ మెచ్చుకున్నారంటూ షారుఖ్ ఫ్యాన్స్ ప్రచారం
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
కశ్మీర్ లో కొన్ని దశాబ్దాల తర్వాత సినిమా థియేటర్లు హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బుధవారం లోక్ సభలో ప్రధాని ప్రసంగించారు. ఎన్డీఏ సర్కారు ఎనిమిదేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇందులో భాగంగా తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రస్తుతం శ్రీనగర్ లోని సినిమా థియేటర్లు హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయని మోదీ చెప్పారు.
కొన్నేళ్లుగా అక్కడ ఇలాంటి పరిస్థితిని ఎవరూ చూడలేదని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు సహా కశ్మీర్ లో యువతకు ఉపాధి కల్పన దిశగా తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో జమ్మూ కశ్మీర్ లో ప్రశాంతత నెలకొంటోందని మోదీ వివరించారు.
థియేటర్లపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను షారుఖ్ ఖాన్ అభిమానులు పఠాన్ సినిమాకు ఆపాదిస్తున్నారు. థియేటర్లు హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయన్న వ్యాఖ్యలు పఠాన్ సినిమాను ఉద్దేశించినవేనని చెబుతున్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ పఠాన్ సినిమాపై ప్రశంసలు గుప్పించారంటూ ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అదికాస్తా వైరల్ గా మారింది.