ఎన్టీఆర్ సినిమా కోసం అటు సైఫ్ అలీఖాన్ .. ఇటు చియాన్ విక్రమ్!
- ఎన్టీఆర్ 30వ సినిమాకి సన్నాహాలు
- స్క్రిప్ట్ పై కసరత్తు పూర్తిచేసిన కొరటాల
- పాన్ ఇండియా స్థాయిలో ఆర్టిస్టుల ఎంపిక
- వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
- ఏప్రిల్ 5వ తేదీన సినిమా రిలీజ్
ఎన్టీఆర్ 30వ సినిమాకి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. నిన్నమొన్నటివరకూ స్క్రిప్ట్ పై కొరటాల జరుపుతూ వచ్చిన మార్పులకు ఫుల్ స్టాప్ పెట్టేసి లాక్ చేసేశారు. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందనీ, వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
'ఆర్ ఆర్ ఆర్'తో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా స్థాయి క్రేజ్ రావడంతో, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మించనున్నారు. ఈ సినిమాలో కథనాయికగా జాన్వీ కపూర్ ను తీసుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయిగానీ, అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇక సముద్రం నేపథ్యంలో జరిగే ఈ కథలో రెండు కీలకమైన పాత్రలు ఉన్నాయనీ, ఒక పాత్రకి గాను సైఫ్ అలీఖాన్ ను .. మరో పాత్రకి గాను చియాన్ విక్రమ్ ను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. కల్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమాలో, ఇంకా ఏయే విశేషాలు చోటుచేసుకుంటాయనేది చూడాలి.