నారా లోకేశ్ 14వ రోజు పాదయాత్ర ప్రారంభం.. ఈనాటి షెడ్యూల్ ఇదిగో

  • జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర
  • సాయంత్రం రంగాపురం క్రాస్ వద్ద బహిరంగ సభ
  • రేణుకాపురంలో రాత్రికి బస
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 14వ రోజు పాదయాత్ర ప్రారంభమయింది. ఈ ఉదయం 8 గంటలకు జీడీ నెల్లూరు నియోజకవర్గం ఆత్మకూరులోని ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రం నుంచి యువగళం పాదయాత్ర మొదలయింది. ముత్యాలమ్మ గుడిలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం మూర్తినాయకనపల్లి చర్చిలో ప్రార్థనలను నిర్వహించారు. మధ్యాహ్నం సంసిరెడ్డిపల్లెలో భోజన విరామం ఉంటుంది. ఇప్పటి వరకు పాదయాత్ర 155.5 కిలోమీటర్లు కొనసాగింది. నిన్న ఆయన 9.6 కిలోమీటర్లు నడిచారు.   

నారా లోకేశ్ 14వ రోజు పాదయాత్ర షెడ్యూల్:

  • ఉదయం 8 గంటలకు ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
  • 8.05 గంటలకు ఆత్మకూరు ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పూజలు.
  • 8.25 గంటలకు మూర్తినాయకనపల్లి చర్చిలో ప్రార్థనలు.
  • 9.20 గంటలకు కడపగుంట ఎస్సీ కాలనీలో ఎస్సీలతో ముఖాముఖి సమావేశం.
  • 11 గంటలకు మహదేవ మంగళంలో స్థానికులతో మాటామంతీ.
  • 12.35 గంటలకు సంసిరెడ్డిపల్లెలో భోజన విరామం.
  • 1.35 గంటలకు సంసిరెడ్డిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
  • మధ్యాహ్నం 2.25 గంటలకు జీడీ నెల్లూరు ఐజడ్ఎం స్కూలులో విద్యార్థులతో భేటీ.
  • 2.55 గంటలకు అవలకొండలో కొత్తగా నిర్మించిన దర్గా ప్రారంభం. 
  • సాయంత్రం రంగాపురం క్రాస్ వద్ద బహిరంగసభలో ప్రసంగం.
  • 6.10 గంటకు రేణుకాపురం విడిది కేంద్రంలో బస.



More Telugu News