పౌలా హర్డ్ తో డేటింగ్ చేస్తున్న బిల్ గేట్స్

  • 60 ఏళ్ల పౌలాతో బిల్ గేట్స్ ప్రేమాయణం
  • ఏడాదికి పైగా డేటింగ్ లో ఉన్న జంట
  • 2019లో పౌలా హర్డ్ భర్త మృతి
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కొత్త జీవిత భాగస్వామిని ఎంచుకున్నారు. 60 ఏళ్ల పౌలా హర్డ్ తో ఆయన డేటింగ్ చేస్తున్నారు. టెక్ దిగ్గజం ఒరాకిల్ మాజీ సీఈవో మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్. అమెరికా పత్రికల కథనం ప్రకారం పౌలాతో 67 ఏళ్ల బిల్ గేట్స్ ఏడాదికి పైగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. గత నెలలో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ సందర్భంగా బిల్, పౌలా కలిసి కనిపించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ ను వీక్షించారు. ఇద్దరూ రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ఉన్నారని... వారు విడదీయలేని జంట అని వారికి అత్యంత సన్నిహితుడైన ఒక స్నేహితుడు తెలిపారు. 

2019లో పౌలా హర్డ్ భర్త మార్క్ హర్డ్ మరణించారు. క్యాన్సర్ తో చాలా కాలం పోరాడిన తర్వాత ఆయన మృతి చెందారు. పౌలా హర్డ్ టెక్ ఎగ్జిక్యూటివ్ గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆమె ఈవెంట్ ప్లానర్ గా పని చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చాలా చురుకుగా ఉంటున్నారు. మరోవైపు బిల్ గేట్స్, మిలిందా గేట్స్ 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 30 ఏళ్ల వైవాహిక జీవితానికి వారు ముగింపు పలికారు.


More Telugu News