కీలక నిర్ణయాలను తీసుకున్న ఏపీ కేబినెట్
- సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
- పలు సంక్షేమ పథకాలకు ఆమోదం
- 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు:
- వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ కల్యాణమస్తు, ఈబీసీ నేస్తం కార్యక్రమాలకు ఆమోదం.
- ఉగాది సంక్షేమ పథకాలకు ఆమోదం.
- జగనన్న విద్యాదీవెన చెల్లింపులకు ఆమోదం.
- విశాఖలో టెక్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం.
- లీగల్ సెల్ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం.
- రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటల్ బెర్త్ ల నిర్మాణానికి ఆమోదం.
- పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ఆమోదం.
- 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం.