చిరంజీవిగారు ఒక శిఖరం .. ఆయన ముందు డాన్సులు చేయకూడదు: కృష్ణవంశీ

  • 'రంగమార్తాండ'ను రెడీ చేస్తున్న కృష్ణవంశీ 
  • వాయిస్ ఓవర్ చెప్పిన మెగాస్టార్ గురించిన ప్రస్తావన 
  • మెగాస్టార్ దగ్గర చనువు తీసుకోలేమని వ్యాఖ్య 
  • ఆయన క్రేజ్ కి తగిన కథను రెడీ చేస్తానని వెల్లడి 
  • అప్పుడే ఆయనను కలుస్తానని వివరణ  
కృష్ణవంశీ సినిమాల్లో వినోదంతో పాటు సామాజిక సందేశం కూడా కనిపిస్తుంది. బంధాలకు .. అనుబంధాలకు ప్రాధాన్యతనిస్తూ ఆయన కథలు నడుస్తాయి. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రంగమార్తాండ' రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"చిరంజీవి గారితో నాకు మంచి చనువు వుంది. అయినా 'రంగమార్తాండ' సినిమాకి వాయిర్ ఓవర్ చెబుతారా?' అని అడగడానికి భయపడ్డాను. 'ఎందుకయ్యా భయం' అని ఆయన అన్నారు. కానీ అంత స్టేచర్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి వెంటనే అడగలేం. చిరంజీవి గారు ఒక శిఖరం .. ఆయన ముందు డాన్సులు చేయకూడదు. మన లిమిట్స్ లో మనం ఉండాలి" అన్నారు.

"అన్నయ్యతో అప్పట్లో ఒక సినిమా చేయాలని అనుకున్నాను. ఆయన కూడా ఉత్సాహాన్ని చూపించారు. కాకపోతే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు కార్యరూపాన్ని దాల్చలేదు. అన్నయ్యతో సినిమా అంటేనే అది ఒక జోనర్ క్రింద లెక్క. అన్ని అంశాలు ఆ కథలో కుదరాలి. చిరంజీవిగారు తప్ప ఈ సినిమాను ఎవరూ చేయలేరు అనేట్టుగా ఉండాలి. అలాంటి కథను సిద్ధం చేయగలిగినప్పుడు దానిని తీసుకుని తప్పకుండా అన్నయ్య దగ్గరికి వెళతాను" అని చెప్పుకొచ్చారు.



More Telugu News